Subcribe to our RSS feeds Join Us on Facebook Follow us on Twitter Add to Circles


job 2


కేవలం పదో తరగతి అర్హతతోనే 54,953 కానిస్టేబుల్, రైఫిల్ మెన్ పోస్టులు..
స్టాప్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ)ల్లో కానిస్టేబుల్ పోస్టులకు, అదేవిధంగా సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సామ్ రైఫిల్స్ లో రైఫిల్ మేన్ పోస్టులకు భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఉద్యోగం: కానిస్టేబుల్స్ (జనరల్ డ్యూటీ) ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్, రైఫిల్ మెన్ (జనరల్ డ్యూటీ) ఇన్ ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్.
మొత్తం పోస్టులు: 54,953. ఎస్సీలకు - 9995, ఎస్టీలకు 4913, ఓబీసీలకు 11,966, జనరల్ కు 32241 పోస్టులు కేటాయించారు.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఆగస్టు 1, 2018 నాటికి కనీసం 18 ఏళ్లు ఉండి 23 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన శ్రేణి: రూ.21,700 - రూ.69,100
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, శరీర సామర్థ్య పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ను వంద మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్ నెస్ /జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/హిందీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లపై ప్రశ్నలు ఉంటాయి. గంటన్నర వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు: రూ.100 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఎక్స్ సర్వీస్ మెన్ సంతానానికి ఫీజు మినహాయింపు). పరీక్ష ఫీజును ఎస్బీఐ/ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబర్ 17, 2018
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: సెప్టెంబర్ 20, 2018
మరిన్ని వివరాలకు ssc.nic.in చూడొచ్చు.

{ 0 comments... read them below or add one }

Post a Comment

Please leave us your valuable comment to improve our blog...

 

Receive All Free Updates Via Facebook.