Subcribe to our RSS feeds Join Us on Facebook Follow us on Twitter Add to Circles


job 1


ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులకు ఐవోసీఎల్ లో 344 పోస్టులు..
నవరత్న కంపెనీల్లో ఒకటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పదో తరగతి-ఐటీఐ, డిప్లొమా (ఇంజనీరింగ్) ఉత్తీర్ణుల నుంచి 344 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు - ఖాళీలు- అర్హతలు..
ట్రేడ్ అప్రెంటీస్: 150
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత.
టెక్నీషియన్ అప్రెంటీస్: 194
అర్హత: డిప్లొమా (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఆగస్టు 31, 2018 నాటికి 18 - 24 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గంటన్నర వ్యవధిలో వంద మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష మార్కులకు 85 శాతం వెయిటేజ్, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరిక్ ఆప్టిట్యూడ్ (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తో కలిపి), రీజనింగ్ ఎబిలిటీస్, బేసిక్ ఇంగ్లిష్ (లాంగ్వేజ్ స్కిల్స్)పై ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 1, 2018
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 21, 2018
పరీక్ష తేదీ: అక్టోబర్ 14, 2018
వెబ్సైట్: www.iocl.com

{ 0 comments... read them below or add one }

Post a Comment

Please leave us your valuable comment to improve our blog...

 

Receive All Free Updates Via Facebook.